- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,డిపిఆర్ఓ ఆదేశాల మేరకు మండల కేంద్రమైన తాడిచర్లలో గురువారం తెలంగాణ సాంస్కృతిక సారథి సెగ్గం శిరీష కళాబృందం ఆధ్వర్యంలో మత్తు పానీయాల నివారణ,చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కళాజాత ద్వారా అవగాహన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాబృందం సభ్యులు సెగ్గం శిరీష,జాడి సుమలత,పులి రాధిక,ఆత్మకూరు మహేందర్,కమ్మల ప్రవీణ్ కుమార్,ఓనపాకల కుమార్,గడ్డం నాగమణి,కాస స్వాతి,చిలుముల మధుబాబు పాల్గొన్నారు.
- Advertisement -



