- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట ఎంపీఓ రెడ్డం రామ కోటా రెడ్డి శుక్రవారం విధుల్లో చేరారు.ప్రభుత్వం గ్రూప్ 2 నూతన ఉద్యోగుల నియామకాల్లో భాగంగా ఆయన మొదటి పోస్టింగ్ అశ్వారావుపేటలో కేటాయించారు. ఎంపీడీఓ అప్పారావు కు జాయినింగ్ లెటర్ ఇచ్చి ఆయన విధుల్లో చేరారు. బిట్స్ పిలాని లో ఎంటెక్ పూర్తి చేసిన ఈయన గతంలో జిల్లా ట్రెజరీ కార్యాలయం జూనియర్ ఎకౌంటెంట్ గానూ పని చేసారు. ఈయన ఖమ్మం జిల్లా తల్లాడ వాసి కావడం గమనార్హం.
- Advertisement -



