Friday, May 16, 2025
Homeతాజా వార్తలువరుణ్ తేజ్ వీడియో షేర్ చేసిన లావణ్య తిపాఠి

వరుణ్ తేజ్ వీడియో షేర్ చేసిన లావణ్య తిపాఠి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కొద్ది రోజుల క్రితం వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి దంప‌తులు తాము త్వ‌ర‌లో త‌ల్లిదండ్రులు కాబోతున్నామంటూ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దాంతో మెగా ఇంటికి వార‌సుడు వ‌స్తాడా, వార‌సురాలు వ‌స్తుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక‌, ప్రెగ్నెంట్‌గా ఉన్న భార్య కోసం తాజాగా మెగా ప్రిన్స్ స్వ‌యంగా పిజ్జా త‌యారు చేశారు.   త‌న కోసం భ‌ర్త ప‌డుతున్న క‌ష్టాన్ని వీడియో తీసి లావణ్య త్రిపాఠి షేర్ చేశారు. ఇక వరుణ్ తేజ్ చేసిన ఆ పిజ్జా అయితే చూస్తేనే యమ్మీ అని అనిపిస్తోంది. తన భార్యకు సేవలు చేసే స‌మ‌యం ఇదే అని వరుణ్ తేజ్ ఇలా టేస్టీ టేస్టీ పిజ్జా చేసినట్టుగా కనిపిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -