పార్టీ మండల కార్యాలయ కార్యదర్శిగా “సింహాద్రి”

నవతెలంగాణ – రాయపర్తి :పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అదేశాలు మేరకు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ కార్యదర్శిగా ఉబ్బని సింహాద్రిని నియమించినట్లు మండల ఇంచార్జ్ గుడిపూడి గోపాల్ రావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సింహాద్రి మాట్లాడుతూ… నియామకానికి సహకరించిన పెద్దలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అమాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మండల నాయకుల ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయ నిర్వహణను సమర్థవంతంగా నిర్వహిస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ బిల్లా సుధీర్ రెడ్డి, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు ఆకుల సురేందర్ రావు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love