Tuesday, November 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసరికొత్తగా భయపెడతాం..

సరికొత్తగా భయపెడతాం..

- Advertisement -

మైత్రీ మూవీ మేకర్స్‌, డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కొలాబరేషన్‌లో యంగ్‌ స్టర్స్‌తో కలసి ఓ సరికొత్త హర్రర్‌ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కీర్తన్‌ నాదగౌడ దర్శకత్వంలో నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్‌ నీల్‌ సమర్పిస్తున్నారు. సూర్య రాజ్‌ వీరబత్తిని, హను రెడ్డి, ప్రీతి పగడాల ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భయంతో కూడిన గ్రామంలోని మెడికల్‌ కాలేజ్‌లో నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. సైన్స్‌, మిస్టరీ, సైన్స్‌, మూఢనమ్మకానికీ అర్ధం కాని ఒక సీక్రెట్‌తో ఇప్పటివరకూ చూడని సరికొత్త కథతో ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వనుంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

ఈ చిత్రంలో శ్రీ వైష్ణవ, శశాంక్‌ పాటిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సమర్పణ: ప్రశాంత్‌ నీల్‌, నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌, దర్శకత్వం: కీర్తన్‌ నాదగౌడ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అనిల్‌ యెర్నేని, డీఓపీ : దినేష్‌ దివాకరన్‌, సంగీతం: వెంకీ జి.జి, డైలాగ్స్‌: మోహన్‌ బి.ఎస్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఉల్లాస్‌ హైదూర్‌, కాస్ట్యూమ్‌ డిజైన్‌: సమృద్ధి పటేల్‌, షర్నితా వల్లూరు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -