హీరో యష్ నటించిన సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. ఈ సినిమా నుంచి విడుదలైన తొలి పాట ‘తబాహీ’ రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ తో చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అదే జోష్‌ను కొనసాగిస్తూ మేకర్స్ రెండో పాట ‘మనసాగదే’ (తెలుగు వెర్షన్)ను విడుదల చేశారు. మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్, జీ మ్యూజిక్ కంపెనీ కలిసి ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాయి.
ఈ పాటలో ప్రేమలోని మరో కొత్త కోణాన్ని ప్రజెంట్ చేసింది. మనసులో దాచుకున్న భావాలు, తీరని తపన, మౌనంగా మిగిలిపోయిన ప్రేమను ఈ పాట ఎంతో అందంగా పలికించింది. ఈ పాటలో యష్, తారా సుతారియా రాయా, రెబెకా పాత్రల మధ్య బంధాన్ని పూర్తిగా కొత్త కోణంలో చూపిం చారు. తనిష్క్ బాగ్చి, అర్స్లాన్ నిజామీ, ఫహీమ్ అబ్దుల్లా స్వరపరిచిన ఈ రొమాంటిక్ మెలోడీకి సిద్ధార్థ్ బస్రూర్ తన వోకల్స్ టప్ ప్రాణం పోశారు.
ఐదు భాషల్లో విడుదలైన ఈ పాట తెలుగు వెర్షన్‌కు ‘మనసాగదే’ టైటిల్ తో రిలీజ్ చేశారు. తెలుగు సాహి త్యాన్ని రామజోగయ్య శాస్త్రి అందించారు. యష్, గీతు మోహన్‌దాస్ కలిసి కథను అందించగా, గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళంతో పాటు పలు భాషల్లో డబ్ వెర్షన్లు విడుదల కానున్నాయి. ఈ చిత్రం ఆగస్టు 26న విడుదల కానుంది.
ప్రేమలో కొత్త కోణం..
- Advertisement -
- Advertisement -


