- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : దర్శకధీరుడు రాజమౌళిపై మూడు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. వారణాసి గ్లింప్స్‌లో మహేష్ బాబు నందిపై కూర్చొని కనిపించడంతో.. హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే నందిపై హీరోని కూర్చోబెట్టారని ఒక కేసు.. బాహుబలి ది ఎటర్నల్ వార్ ట్రైలర్‌లో బాహుబలి, ఇంద్రుడితో యుద్ధం చేస్తున్నట్టుగా చూపిండంపై మరో కేసు నమోదైనట్లు సమాచారం. ఇప్పటికే వారణాసి ఈవెంట్‌లో హనుమంతుడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని రాజమౌళిపై రాష్ట్రీయ వానర సేన సంఘం సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
- Advertisement -



