Monday, July 27, 2026
E-PAPER
Homeసినిమాభావోద్వేగ కథతో ‘తీరం’

భావోద్వేగ కథతో ‘తీరం’

- Advertisement -


శ్రీ భవానీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘తీరం’ సినిమా టైటిల్ సాంగ్‌ను ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ‘పుష్ప’ ఫేమ్ నటుడు జగదీష్, ఫన్ బకెట్ మహేష్ విట్ట, నటుడు రాజ్‌కుమార్ కసిరెడ్డి, దర్శకుడు ప్రసాద్, జబర్దస్త్ సద్దాం, నటుడు కుమానన్ తదితరులు హాజరై టైటిల్ సాంగ్‌ను ఆవిష్కరించారు.
ఈ సంద‌ర్భంగా దర్శకుడు వంశీ మునగాల మాట్లాడుతూ, ‘ప్రతి ఒక్కరి హృద యాలను తాకేలా భావోద్వేగభరితమైన కథతో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రీకరణ విజయవంతంగా పూర్తై, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయిఅని తెలిపారు. 'దర్శకుడు వంశీ మునగాల కథ ఎంతో బాగుంది. కథపై నమ్మకంతోనే ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చాం. సినిమా అద్భుతంగా వచ్చింది. సరికొత్త అనుభూతినిచ్చే సినిమా అవుతుంది అని నిర్మాత ఉపేందర్ గంగావెల్లి చెప్పారు. హీరో ప్రభు మాట్లాడుతూ, ‘షార్ట్ ఫిల్మ్స్‌తో సినీ ప్రయాణాన్ని ప్రారంభించి ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్‌లో హీరోగా నటించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందిఅని తెలిపారు. 'జీవితంలో ఎంతో కష్టపడితే గానీ తీరం చేరలేమనే సందేశానికి ఈ సినిమా ఒక ప్రతీక అని రమణ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -