Monday, July 27, 2026
E-PAPER
Homeసినిమాచిట్టిబాబుగా వెంకీ..

చిట్టిబాబుగా వెంకీ..

- Advertisement -

హీరో వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న కుటుంబ కథా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రధాన పాత్రలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు.తొలి పాత్రగా వెంకటేష్ పోషిస్తున్న ‘చిట్టిబాబు’ పాత్రను పరిచయం చేయగా, అనంతరం శ్రీనిధి శెట్టి, యువినా పార్థవి, రాజా ప్రజ్వల్ పాత్రలను పరిచయం చేయ నున్నారు. ఈ నలుగురి పాత్రలు ఈ ఆత్మీయ కుటుంబ కథకు హృదయంగా నిలవనున్నాయి.
ఈ చిత్రంలో వెంకటేష్ చిట్టిబాబు పాత్రలో అలరించ నున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా : రవి కె. చంద్రన్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -