శ్యాంసుందర్ రెడ్డి అంతక్రియలు మహాప్రస్థానంలో జరిగాయి..

నవతెలంగాణ -మోపాల్

మోపాల్ మండలం నర్సింగ్ పల్లి గ్రామానికి చెందిన సినీ నిర్మాత దిల్ రాజు తండ్రి ఉమ్మడి ముదక్పల్లి మాజీ సర్పంచ్ శ్యాంసుందర్ రెడ్డి సోమవారం రోజున రాత్రి స్వర్గస్తులైనారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం రోజున జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరిగాయి. సినీ ప్రముఖులు చిరంజీవి, ప్రకాష్ రాజ్ తదితరులు ఆయనకు నివాళులర్పించారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే నర్సింగ్ పల్లి   గ్రామస్తులందరూ కన్నీటి మున్నీరయ్యారు , మంగళవారం రోజు మండల కేంద్రానికి చెందిన చాలామంది నాయకులు, గ్రామ ప్రజలు చివరిసారిగ తన పార్థివ దేహాన్ని చూడడానికి బయలుదేరి వెళ్లడం జరిగింది. గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్యాంసుందర్ రెడ్డి కి ముగ్గురు కుమారులు , పెద్ద కుమారుడు నరసింహారెడ్డి ఇక్కడ నర్సింగ్ పల్లి లో గల  ఇందూరు తిరుమల క్షేత్రం బాధ్యతలు అన్ని ఆయనే చూస్తారు.
Spread the love