మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడిగా రవి సందుపట్ల

నవతెలంగాణ- తాడ్వాయి :
ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన రవి సందుపట్ల ని ములుగు జిల్లా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జిల్లా అధ్యక్షునిగా ఆ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బైరి నరేష్ నియామకం చూసినట్లు ఆయన ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సెప్టెంబర్ 17, 2023 లో స్థాపించారని ఈ సంఘానికి ములుగు జిల్లా అధ్యక్షునిగా నియమించిన, నామీద నమ్మకంతో నియమించిన బైరి నరేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు రవి సందుపట్ల మాట్లాడుతూ  ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో పెరుగుతుందని ప్రస్తుతం పరిస్థితులలో నా వంతుగా ప్రజలను ఉన్నటువంటి మూఢనమ్మకాలను వాటి వల్ల జరిగే నష్టాల గురించి చెబుతూ ప్రజలను జాగృత పరుస్తానని తెలిపారు. అంతరిక్షంలోకి రాకెట్ పంపి, విశ్వాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి ఈ కాలంలో గుండెను తీసి మరొకరికి గుండెను అమర్చి ప్రాణాలు కాపాడుతున్నారు. నోటి ద్వారా లోపలికి మిషన్స్ పంపించి ఆపరేషన్ చేస్తున్నారు, అవయవాలు మార్పిడి మనిషి ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్స్ సైన్స్ ఇంత అభివృద్ధి చెందుతున్న ఇంకా జ్వరం వచ్చినా, నొప్పి వచ్చిన బాబాల దగ్గరికి, మాంత్రికుడు దగ్గరికి, క్షుద్ర పూజలు చేస్తున్నటువంటి వారి దగ్గరికి వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. జబ్బు ఎక్కువైనాక డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా సరే అక్కడికి వెళ్లి ప్రజలను చైతన్య పరచనున్నట్లు, స్కూల్ లల్లోకి వెళ్లి, స్కూల్ పిల్లల కూడా అవగాహన కార్యక్రమం చేపడతానని తెలిపారు. మూఢనమ్మకాల నిర్మూలన కోరుకునేవారు ఎవరైనా ఉంటే మాకు పరిచయం కావాలని కోరుతూ 8 9 8 5 6 8 2 4 9 1 ఫోన్ నెంబర్ కి కాల్ చేసి సంఘంలో చేరాలని కోరారు.
Spread the love