చేసిన అభివృద్దే మా బలం బలగం

– అజ్మీర ప్రహ్లాద్  బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి.
నవతెలంగాణ-గోవిందరావుపేట:  గత 35 సంవత్సరాలుగా మండలంతో ఉన్న అనుబంధం మరియు చేసిన అభివృద్దే మా బలము బలగం అని బీజెపి ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి అజ్మీర ప్రహ్లాద్ అన్నారు. గురువారం మండలంలోని పసర నాగారం పంచాయతీ పరిధిలోని నేతాజీ నగర్ గ్రామంలో బీజెపి మండల అధ్యక్షులు మద్దినేని తేజ రాజు ఆధ్వర్యంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు బీజెపి పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ప్రహ్లాద్ మాట్లాడారు. మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు తండ్రిగారైన అజ్మీర చందూలాల్ హయాంలో కోట్ల రూపాయల నిధులతో మండలాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. మండలంతో మాకు బంధుత్వపరంగా అభివృద్ధి పరంగా పార్టీ ద్వార నాయకత్వపరంగా కార్యకర్తల అండదండలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. అదే మాకు కొండంత ఓటు బ్యాంక్ అని అన్నారు. అనంతరం బీజెపి ములుగు జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అది బీజెపి ప్రభుత్వ ఏర్పాటు అని అన్నారు. గతంలో ప్రజలను మోసం చేసిన ఇరు పార్టీలకు కాలం చెల్లిందని అన్నారు. ధరావత్ పున్నం అన్నపూర్ణ సమక్షంలో ఇంతమంది కార్యకర్తలు పార్టీలోకి చేరడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ముందు ముందు వలసల పర్వం ఇంకా పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో  భారతీయ జనతా పార్టీ ములుగు అసెంబ్లీ కన్వీనర్ బలరాం, మహబూబాబాద్ పార్లమెంటు కో కన్వీనర్ తక్కేల్ల పెళ్లి.  దేవేందర్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు  ఏనుగు రవీందర్ రెడ్డి, కార్యదర్శి సాంబశివారెడ్డి ,రుద్రారపు సురేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్, మండల ప్రధాన కార్యదర్శిలు మెరుగు సత్యనారాయణ, ఏదునూరి రమేష్, కొత్త సుధాకర్ రెడ్డి, అంత్ రెడ్డి  సత్యనారాయణ రెడ్డి ,రమాదేవి ,సంసోద్ రాజన్న నాయక్, వంకడూత్ వినోద్, పొన్నం, వెంకన్న, భూత అధ్యక్షులు పూజారి శ్రీనివాస్, అశోక్, నూతన కార్యకర్తలు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు.
Spread the love