అక్రమంగా మద్యం నిల్వచేసి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు

నవతెలంగాణ-గోవిందరావుపేట : అక్రమంగా బెల్ట్ షాపులు మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్న ఇరువురి వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ షేక్ మస్తాన్ తెలిపారు. ఆదివారం మండలంలోపసర ఎస్సై షేక్ మస్తాన్   తన సిబ్బందితో కలిసి ఎలక్షన్ కోడ్ నేపథ్యం లో  మండలం లోని బుసపూర్, మొద్దులగూడెం గ్రామాల్లో బెల్ట్ షాపులలో ఆకస్మిక తనిఖీ నిర్వహించటం జరిగింది.ఈ తనిఖీ లో ఆయా గ్రామాలకు చెందిన ఇద్దరు ఎలక్షన్ కమిషన్   నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మద్యం నిల్వచేసి విక్రయిస్తూ  పట్టుబడటం జరిగింది. మద్యం ను సీజ్ చేసి విక్రయిస్తున్న వ్యక్తులపై పై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రాంభించనైనదన్నారు. నిందితుల వివరాలు:1.పడియా రాజుS/o భాధియా R/o మొద్దులగూడెం 4920/- విలువైన మద్యం స్వాధీనం.2. పంగ గణేష్ తండ్రి రవీందర్ నివాసం చల్వాయి 7886/- విలువైన మద్యం స్వాధీనం
Spread the love