లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇండిస్టియల్‌ మేనేజర్‌

Taking a bribe A captured industrial managerనవతెలంగాణ-భూపాలపల్లి టౌన్‌
జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్‌ వద్ద ఇండిస్టియల్‌ మేనేజర్‌ గంగాధర శ్రీనివాస్‌ గురువారం రూ.15,000 లంచం తీసుకుంటుండగా అధికారులు దాడులు చేసి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ములుగుకు చెందిన గుగులోతు లచ్చిరాం జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా గతేడాది రూ.53 లక్షలకు అశోక్‌ లేలాండ్‌ వాహనాన్ని కొనుగోలు చేశారు. దానికి సంబంధించి సబ్సిడీ కోసం లచ్చిరాం కొద్ది రోజుల కిందట జిల్లా పరిశ్రమల శాఖలో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి శ్రీనివాస్‌. లచ్చిరాం నుంచి మొదట రూ. 50వేలు తీసుకున్నాడు. అనంతరం మళ్లీ రూ.60 వేలు కావాలని డిమాండ్‌ చేయడంతో లచ్చిరాం ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఈ క్రమంలో గురువారం లచ్చిరాం రూ.15వేలు ఇస్తుండగా జిల్లా పరిశ్రమల అధికారి శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతడిని హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్టు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.

Spread the love