- Advertisement -
నవతెలంగాణ-నిజాంసాగర్
తరచుగా ఫోన్ మాట్లాడుతున్నందుకు తండ్రి మందలించగా సిలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని చిన్న ఆరేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై శివకుమార్ కథనం ప్రకారం.. మండలంలోని చిన్న ఆరెపల్లి గ్రామానికి చెందిన రాకేష్ (20) తరచూ ఫోన్ మాట్లాడుతూ ఉండగా తండ్రి గంగారం తరచుగా ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావ్ అని ప్రశ్నించగా సోమవారం ఉదయం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు ఆయన తెలిపారు. తండ్రి గంగారం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
- Advertisement -