Saturday, July 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఉజ్బెకిస్థాన్‌లో కేరళం వైద్య విద్యార్థిని దారుణ హత్య

ఉజ్బెకిస్థాన్‌లో కేరళం వైద్య విద్యార్థిని దారుణ హత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉజ్బెకిస్థాన్‌లో ఓ విద్యార్థిని దారుణ హత్యకు గురయ్యారు. కేరళంలోని అలప్పుళ జిల్లా హరిపాడ్‌కు చెందిన సవారియా బసంత్‌ (21), మలప్పురం జిల్లాకు చెందిన సదరుల్‌ అనం (22) ఇద్దరూ ఉజ్బెకిస్థాన్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. ఈ నెల 3న వీరిద్దరి మధ్య హాస్టల్‌ గదిలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన సదరుల్‌ ల్యాప్‌టాప్‌తో సవారియాపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మతం మార్చుకోవాలని నిందితుడు ఒత్తిడి తీసుకువచ్చాడని, ఒప్పుకోకపోవడంతోనే ఈ దారుణానికి పాల్పడాడ్డని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -