Friday, July 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి: కలెక్టర్

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ-వనపర్తి 
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై వేటు తప్పదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల స్థాయి అధికారులు, బీఎల్‌ఓలతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎస్‌ఐఆర్‌ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పూర్తి చేసేందుకు కేవలం 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున ప్రతి అధికారి పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటివరకు కేవలం 24 శాతమే డిజిటలైజేషన్ పూర్తయిందని, ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ వేగాన్ని మరింత పెంచి, ప్రతిరోజూ నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని ఆదేశించారు.

బీఎల్‌ఓలకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది పూర్తిస్థాయిలో సహకరించాలని, ప్రతి పోలింగ్ కేంద్రానికి అవసరమైన 3 వాలంటీర్లను ఏర్పాటు చేసి ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా అత్యంత జాగ్రత్తగా పని చేయాలని, ఏవైనా నిర్లక్ష్యం లేదా అలసత్వం ప్రదర్శిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బీ ఎల్ ఓ లపై సూపర్వైజర్లు, తహసీల్దార్లు పర్యవేక్షణ కొనసాగించి నిర్దేశించిన గడువు లోగా ప్రక్రియ పూర్తయ్యేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం గా వ్యవహారిస్తే సస్పెండ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

రానున్న 15 రోజుల పాటు ఎస్‌ఐఆర్‌ పనులకే ప్రాధాన్యత ఇవ్వాలని, ఎవరికీ ఈ 15 రోజులు సెలవులు మంజూరు చేయబోమని స్పష్టం చేశారు. తహసీల్దార్ అనుమతి లేకుండా ఎవరూ సెలవులు తీసుకోవద్దని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి ప్రజలకు ఎన్యూమరేషన్ ఫారం ల పూరించడంలో అవసరమైన సహాయం అందించాలని, ప్రతిరోజూ పనుల పురోగతిని పర్యవేక్షిస్తూ లక్ష్యాలను పూర్తిచేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ప్రతిరోజూ 100 ఫారం లు డిజిటలైజేషన్ చేయడమే లక్ష్యం గా పనిచేయాలని, 20 వ తేదీ లోపు డిజిటలైజేషన్ పూర్తి చేయాలన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, జడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డిఆర్డిఓ ఉమాదేవి, జిల్లా సంక్షేమ అధికారిని సుధారాణి, ఎంపీడీవోలు, తహసిల్దార్లు, సూపర్వైజర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -