Friday, December 19, 2025
E-PAPER
Homeబీజినెస్వడ్డీ రేట్లు తక్కువగానే ఉండొచ్చు..!

వడ్డీ రేట్లు తక్కువగానే ఉండొచ్చు..!

- Advertisement -

ఆర్బీఐ గవర్నర్‌ మల్హోత్రా అంచనా

న్యూఢిల్లీ
: రాబోయే కాలంలో వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలోనే కొనసాగొచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌ సంజరు మల్హోత్రా అభిప్రాయ పడ్డారు. ఈ అంచనాలో అమెరికాతో పెండింగ్‌లో ఉన్న వాణిజ్య ఒప్పందాలు, యూరోపియన్‌ యూనియన్‌తో దాదాపు పూర్తయిన ఒప్పందాల ప్రభావాలను ఇంకా పరిగణనలోకి తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. అమెరికాతో జరిగే వాణిజ్య ఒప్పందం వల్ల ఆర్థిక వ్యవస్థపై సుమారు అర శాతం మేర సానుకూల ప్రభావం ఉండవచ్చని గవర్నర్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ త్రైమాసికంలో భారత జీడీపీ అనుహ్యాంగా 8.2 శాతం వృద్ధిని సాధించడం పట్ల ఆయన ఆశ్యర్చం వ్యక్తం చేశారు. ఆర్బీఐ గతంలో 7 శాతం వృద్ధిని అంచనా వేయగా, కేంద్ర గణాంకాలు అంతకంటే ఎక్కువగా రావడం గమనార్హం. డేటా రివిజన్‌ (సవరణలు) జరిగే క్రమంలో స్వల్ప తప్పిదాలు ఉండటం సహజమేనని, అయితే మొత్తం మీద గణాంకాలు పటిష్టంగానే ఉన్నాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -