- Advertisement -
బెంగళూరు : విడిభాగాలు, మెమరీ చిప్‌లు, తయారీ, లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడంతో ఏఐ+ స్మార్ట్‌ఫోన్ ఎంపిక చేసిన మోడళ్ల ధరలను రూ.2,000 వరకు పెంచింది. పల్స్ 2పై రూ.500–1,000, నోవా 2 సిరీస్‌పై రూ.1,000, ప్రో, అల్ట్రా మోడళ్లపై రూ.2,000 వరకు పెంపు వర్తిస్తుందని ఆ కంపెనీ సిఇఒ మాధవ్ సేత్ తెలిపారు. వ్యయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ పోటీతత్వ ధరల్లో నాణ్యమైన ఉత్పత్తులు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
- Advertisement -



