- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండల కేంద్రంలోని మైనార్టీ సోదరులను మర్యాదపూర్వకంగా జక్రాన్ పల్లి నూతన సర్పంచ్ బండి పద్మ సత్యం కలిశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ సోదరులకు నాకు మద్దతు తెలిపినందుకు పాదాభివందనాలు తెలియజేస్తున్నానని అన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే శ్రీ రేకులపల్లి భూపతి రెడ్డి సహకారంతో అభివృద్ధిలో ఇంకా ముందుకు వెళ్దామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.
- Advertisement -



