Monday, June 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బరంగెడ్గిలో పారిశుధ్య పనులు ముమ్మరం 

బరంగెడ్గిలో పారిశుధ్య పనులు ముమ్మరం 

- Advertisement -

సర్పంచ్ అనిల్ కుమార్‌కు  ప్రశంసలు 
నవతెలంగాణ – బీర్కూర్ (నసురుల్లాబాద్) 

బీర్కూర్ మండలంలోని బరంగెడ్గి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన మురికి మట్టి, చెత్తాచెదారం, మురుగు కాలువల సమస్యలను పరిష్కరించేందుకు గ్రామ సర్పంచ్ రేంజర్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో విస్తృత పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. గత తొమ్మిది రోజులుగా నిరంతరంగా సాగుతున్న ఈ పనుల ద్వారా గ్రామంలోని మురుగు కాలువలను శుభ్రపరుస్తూ, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామంలో పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజారోగ్య పరిరక్షణ కోసం సర్పంచ్ చేస్తున్న కృషిని గ్రామస్తులు అభినందిస్తున్నారు. గ్రామాభివృద్ధి పట్ల ఆయన చూపుతున్న చొరవ ఇతర ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తోందని పలువురు గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రవీణ్, వార్డు సభ్యులు శివకళ, బుమవ్వ, సాయిలు, గంగవ్వ, బాలేష్, యాదవరావు, అనిల్, హన్మండ్లు, రేణుక, పంచాయతీ కార్యదర్శి గురునాథ్, కారొబార్ పర్వయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -