Monday, June 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చలో కలెక్టరేట్ కు తరలిన పరకాల మున్సిపల్ కార్మికులు

చలో కలెక్టరేట్ కు తరలిన పరకాల మున్సిపల్ కార్మికులు

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ హనుమకొండ జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల కార్మికులు సోమవారం హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయం వద్ద భారీ ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో పరకాల మున్సిపాలిటీ నుంచి అధిక సంఖ్యలో కార్మికులు తరలివచ్చి తమ నిరసన గళాన్ని వినిపించారు. తెలంగాణ మున్సిపాలిటీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పరకాల యూనియన్ అధ్యక్షులు మడికొండ ప్రమోద్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను తక్షణమే పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 60 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని, విధుల్లో ఉండగా మరణించిన కార్మికుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కార్మికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎం. ప్రకాష్, మంద మహేష్, కె. శ్రీను, అంజయ్య, రాజభద్రయ్య, అనంత, రంగయ్య, వెంకటేశంలతో పాటు పలువురు కార్యవర్గ సభ్యులు, పరకాల మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -