- Advertisement -
నవతెలంగాణ – జఫర్ గడ్: జనగామ జిల్లా జఫర్ గడ్ మండలంలోని మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమ నిర్వాహకులు మాజీ మావోయిస్టు నేత గాదే ఇన్నయ్యను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. అరెస్ట్ చేసి హైదరాబాదులోని నాంపల్లి కోర్టుకు తరలించారు. అరెస్టు గల కారణాలు ఇటీవల మరణించిన మావోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అంత్యక్రియ సభలో జన సమూహాన్ని ఉద్దేశించి నిషేధిత ఉగ్రవాద సంస్థను సిపిఐ (మావోయిస్టు) ప్రోత్సహిస్తున్నట్లు మాట్లాడినందుకుగాను అరెస్టు చేసినట్లు దర్యాప్తు సంస్థ అందించిన నోటీసులో పేర్కొన్నారు.
- Advertisement -



