నవతెలంగాణ – హైదరాబాద్: వికలాంగుల హక్కుల పరిరక్షణకు నిరంతరం పోరాటాలు కొనసాగించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు టి. జ్యోతి అన్నారు. సమాజంలోని అసమానతలపై పోరాడే శక్తులకు పత్రికలు వారధిగా నిలవాలని, ప్రజల గొంతుకగా పనిచేయాలని ఆమె పేర్కొన్నారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘వికలాంగుల వాయిస్’ మాస పత్రిక 12వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘రాజ్యాంగ హక్కులు–భావ ప్రకటన స్వేచ్ఛ–సవాళ్లు’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. పత్రిక ఎడిటర్, ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 12వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను టి. జ్యోతి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా టి. జ్యోతి మాట్లాడుతూ.. సమాజంలో ఉన్న అసమానతలపై పోరాడే శక్తులకు పత్రిక దోహదపడు తుందని అన్నారు.సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని అన్నారు.వైకాల్యం కలిగిన వారికి చట్ట బద్దంగా ఉన్న హక్కులను పొందలేక పోతున్నారని అన్నారు. అంగవైకల్యం లోపం కాదని పాలకుల వైపల్యమేనని అన్నారు.వాస్తవలను ప్రజల ముందుకు తీసుకురావడానికి పత్రిక చేస్తున్న కృషిని కొనసాగించడానికి కృషి చేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు. మహిళా వికలాంగులపై రోజు రోజుకు వేధింపులు పెరిగిపోతు న్నాయని అన్నరు.మనువాదం మహిళల పాలిట శాపంగా ఉందని అన్నారు.ప్రశ్నించే వారిని హత్య చేయడమేనా ప్రజాస్వామ్యమని అన్నారు. 12 ఏండ్ల మోడీ పాలనలో దేశంలో అసమానాలు పెరిగిపోతున్నాయని అన్నారు.మోడీ పాలన ఆధాని, అంబాని కోసమే ఉన్నాయని, 90 శాతం ఉన్న పేదల కోసం ఎందుకు ప్రభుత్వం ఆలోచన చేయడం లేదని అన్నారు. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని అన్నారు. దోపిడీ, అసమానతలు లేని వ్యవస్థ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.ప్రశ్నించె వారిని అర్భాన్ నక్షల్స్ అని ప్రచారం చేస్తున్నారని అన్నారు.ప్రశ్నించడమే మనముందున్న లక్ష్యమని అన్నారు.వికలాంగుల వాయిస్ పత్రిక వికలాంగులలో చైతన్య పరిచడానికి చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.
అవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.డి. అబ్బాస్ మాట్లాడుతూ.. పత్రికలు ప్రజల హక్కుల కోసం జరిగే ఉద్యమాలకు వారధిగా ఉండాలని అన్నారు.హక్కుల కోసం ప్రశ్నించే వారిని హతమార్చడం నేటి పాలకులు లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే అనేక మందిని జైళ్ళలో ఎందుకు పెడుతున్నారని అన్నారు.పాలకులు చెప్పిన విధానాలు అమలు చేయకుంటే వారిని దేశ ద్రోహులుగా చిత్రికరించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడిదని అన్నారు. ప్రజల తిండి, బట్టపై ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని అన్నారు. హిందూత్వ మతోన్మాద విధానాలు అమలు చేయడమే మోడీ విధానామా అని ప్రశ్నించారు.స్వేచ్ఛ, సమానత్వం,సౌబ్రతుత్వం లేకుండా పోతుందని అన్నారు. రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన అనేక హక్కులను తీసువేయడానికి కుట్రలు చేస్తున్నారని అన్నారు. సామాజిక న్యాయన్ని సమాధి చేయడమే మోడీ లక్ష్యమని అన్నారు.భక్తి ముసుగులో ప్రజలలో అసమానతలు సృష్టిస్తున్నారని అన్నారు.రాజ్యాంగం స్థానంలో మానుధర్మ శాస్త్రన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడమే ప్రజల ముందున్న కర్తవ్యమని అన్నారు.
కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు మాట్లాడుతూ.. విద్యా, వైద్యం పేదలకు అందడం లేదని అన్నారు.పాలకులు విద్యా, వైద్యాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టాబేడుతున్నారని అన్నారు.ప్రజల అవసరాకంటే పాలకులు సంపన్నుల ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని అన్నారు.మోడీ అమలు చేస్తున్న విధానాల వలన పేదలు మరింత పేదలుగా సంపన్నులు మరింత సంపన్నులుగా మారుతున్నారని అన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రయివేట్పరం చేయడం వలన పేదలు పొందుతూన్న రిజర్వేషన్స్ కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. రాజ్యాంగన్ని కాపాడుకోవడం ద్వారానే పేదలు పొందుతూన్న హక్కులను, ఛట్టాలను కాపాడుకుంటామని అన్నారు
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎం. పద్మశ్రీ మాట్లాడుతూ..సమాజంలో వికలాంగులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వారిలో చైతన్యం తేవడానికి పత్రిక కృషి చేస్తుందని అన్నారు. పాలకుల విధానాల వలన సమాజంలో మానసిక వైకాల్యం పెరుగుతుందని అన్నారు. వికలాంగులు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తుంటే పాలకులు పట్టించుకోవడం లేదని అన్నారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని అంతమోదించడానికి మతోన్మాదశక్తులు కుట్రలు చేస్తున్నారని అన్నారు. హక్కుల కోసం జరిగే పోరాటాలకు పత్రికలు వారధిలా ఉండాలని అన్నారు.
ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య మాట్లాడుతూ.. వికలాంగులలో సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం నింపేందుకు 2014 సంవత్సరంలో వికలాంగుల వాయిస్ మాస పత్రికను ప్రారంభీంచడం జరిగిందని అన్నారు.12 ఏండ్లుగా పత్రికను నడిపేందుకు పట్టుదలతో కృషి చేస్తున్నామని అన్నారు. వికలాంగుల చట్టాలు, సంక్షేమ పథకలను వికలాంగులలోకి తీసుకెళ్లి చైతన్యం చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు. పత్రిక అనేది వికలాంగుల చేతిలో ఆయుధమని అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల హక్కులను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు.వికలాంగుల చట్టాలను మార్చాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికోడతామణి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1000 రోజులు అవుతున్నాదాని అన్నారు. 420 హామీలు, 6 గ్యారంటీలు హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని అన్నారు.పెన్షన్స్ పెంపు కోసం ఇచ్చిన హామిని అమలు చేయకుండా చేయూత లబ్ధిదారులను మోసం చేసిందని అన్నారు.ఆగష్టు 26 నుండి సెప్టెంబర్ 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పత్రిక 12 వార్షికోత్సవ ఉత్సవాలు నిర్వహిస్తున్నమని తెలిపారు. రాష్ట్రంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెన్షన్ల పెంపు సహా వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘వికలాంగుల వాయిస్’ 12వ వార్షికోత్సవ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు టి. వరమ్మ, అధ్యక్షుడు కె. వెంకట్ మాట్లాడుతూ.. వికలాంగుల కోసం అనేక హక్కులు వికలాంగుల చట్టలలో ఉన్నాయని అన్నారు. స్పెషల్ టీచర్స్ నియమించాలని సుప్రీం కోర్ట్ చూపిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. రాష్ట్రంలో 21 రకాల వైకాల్యాలు ఉన్నాయని వారందరికీ వైకల్య ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం లేదని అన్నారు. చిన్నతనంలోనే అంగవైకల్యం నిర్దారణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. పోరాటాల ద్వారానే వికలాంగుల హక్కులను కాపాడుకుంటామని అన్నారు.పెన్షన్స్ పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో NPRD రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్, ఉపాధ్యక్షులు కె యశోద, బి స్వామి వి ఉపేందర్ , సహాయ కార్యదర్శులు నాగలక్ష్మి, కాశప్ప, రాష్ట్ర కమిటీ సభ్యులు బంగారయ్య, దుర్గ, షాహిన్ బేగం, రమేష్,లలిత లతో పాటు వివిధ జిల్లాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




