- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఇప్పలపల్లి గ్రామ రజక సంఘం నూతన కమిటీని నియామకం చేసినట్లుగా మండల రజక సంఘం అధ్యక్షుడు పావురాల ఓదెలు తెలిపారు. బుధవారం రజక సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా పెనుగొండ నరేష్,ప్రధాన కార్యదర్శిగా పెనుగొండ మహేష్, కార్యదర్శిగా పెనుగొండ దేవేందర్, ఉపాధ్యక్షుడుగా పెనుగొండ మహేందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో భూపాల్ పల్లి జిల్లా అధ్యక్షుడు ఐతు బాపుతోపాటు పలువురు పాల్గొన్నారు.
- Advertisement -



