- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామ సర్పంచ్ గా కొండ రాజమ్మ,ఉప సర్పంచ్ గా లకవత్ సవేందర్ ఎన్నికైయ్యారు. సోమవారం ప్రత్యేక అధికారి,కార్యదర్శిచే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చెరపట్టారు. ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పించిన ప్రజలకు వారు ప్రత్యేక తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోద్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి, తాజా మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, మాజీ జెడ్పిటిసి ఐత కోమల రాజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు జక్కుల వెంకటస్వామి యాదవ్ పాల్గొన్నారు.
- Advertisement -



