- Advertisement -
నవతెలంగాణ – తిమ్మాజిపేట
టీఎస్ యుటిఎఫ్ తిమ్మాజీపేట మండల కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 28, 29 తేదీలలో జనగామలో జరిగే టీఎస్ యుటిఎఫ్ రాష్ట్రవిస్తృత స్థాయి సమావేశం, విద్యా సదస్సులను జయప్రదం చేయాలని కోరుతూ గోడ పత్రిక, కరపత్రాలను జడ్.పి.హెచ్.ఎస్ తిమ్మాజీపేట ఆవరణలో టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె జంగయ్య, మండల విద్యాధికారి సత్యనారాయణ శెట్టి గోరిట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ రెడ్డి లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ మండల అధ్యక్షులు ఎండీ నసిర్, నాయకులు ఎల్లయ్య, రాములు, లక్ష్మణ్, సమీర్, లక్ష్మీ కాంత్, మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -



