- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని రెడ్డిపేట్, రామారెడ్డి, అన్నారం, మద్దికుంట, ఉప్పల్వాయితోపాటు పలు గ్రామాల్లో గురువారం క్రిస్మస్ వేడుకలను ప్రత్యేక ప్రార్థనలతో నిర్వహించారు. రామారెడ్డి తోపాటు అన్నారంలో మాజీ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. పలు చర్చిల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచానికి మార్గదర్శకమని పలువురు అన్నారు. కార్యక్రమంలో ఆయా చర్చిల పాస్టర్లు, కీసరి రాజు, కంచం రాజు, కాంగ్రెస్ నాయకులు సల్మాన్, చింతకుంట కిషన్, నామాల రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



