నవతెలంగాణ – ఆలేరు
కేసీఆర్ మాట్లాడే భాష.. తిట్ల పురాణం గూగుల్ సెర్చ్, యూట్యూబ్ లో చూస్తే మీకు తెలుస్తుందని, హరీష్ రావుకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హితువు పలికారు. నవతెలంగాణకు గురువారం ఆయన పంపిన వీడియోలో నీ ఆయన మాటలు.. నీ మామ కేసీఆర్ ఉద్యోగ సమయంలో ఏది పడితే అది మాట్లాడితే చెల్లింది. ఎందుకంటే నీళ్లు ఉద్యోగాలు కోసం చేస్తున్న పోరాటం కదా అని తెలంగాణ సమాజం భరించింది.
రాష్ట్రం ఏర్పడ్డది 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ పరిపాలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలెంజ్ చేసి మరి 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించి మీ మామ కె సి ఆర్ ఫామ్ హౌస్ పంపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషపై మీరు విమర్శించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని కెసిఆర్ రెండు సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ తోలు తీస్తామని మాట్లాడడం పట్ల ఖండించాల్సింది పోయి, హరీష్ రావు నీ తిట్లు చెట్టుకు కట్టివేస్తాం.. లాగుల తొండలు తోలుతామని.. నీ భాష మరింత దిగజారుడుగా ఉందన్నారు. నీ బావమరిది కే టీ ఆర్ చిన్న పెద్ద తేడా లేకుండా నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతూ.. ఇరిగేషన్ గురించైనా.. ఐటీ గురించైనా తనకే తెలుసు అనే అనే భ్రమలో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడని విమర్శించారు.
మీరు పద్ధతిగా మాట్లాడితే.. సీఎం రేవంత్ రెడ్డి పద్ధతిగా సమాధానం ఇస్తారని చెప్పారు. లేకుంటే మీరు మాట్లాడే భాషలోనే మీకు చెబితే మీకు అర్థం అవుతుందని ముఖ్యమంత్రి అలా మాట్లాడాల్సి వస్తుందన్నారు. రాబోయే 2029లో మీతో సహా అందర్నీ ఇంటికి పంపించడం ఖాయమన్నారు. బిజెపి కేంద్ర బండి సంజయ్ సీఎo మాజీ సీఎంల ఒకరినొకరు గౌరవించుకోవాలని చెప్పడం బాగుంది కానీ ముందుగా కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావులకు మాట్లాడే భాష పై బుద్ధి చెప్పాలని అన్నారు. ప్రతిపక్ష నాయకులుగా సూచనలు సలహాలు వాస్తవాల ఆధారంగా ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.



