నవతెలంగాణ – ఆర్మూర్
జగద్గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రీజీ జన్మదిన నవంబర్ 11 సందర్భంగా నవంబర్ 1 నుండి 11 వ తారీకు వరకు పత్రీజీ జన్మదిన సంబరాలనుఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ జన్మదిన సంబరాలలో భాగంగా గురువారం పట్టణంలోని మామిడిపల్లి గ్రామంలో లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మాణ కర్త మల్యాల రమ్యశ్రీ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కేకును కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పి ఎస్ ఎస్ ఎం జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణ రెడ్డి, నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహా శక్తి క్షేత్రం చైర్మన్ శ్రీను తిరుమల గంగారాం రెడ్డి , సెక్రెటరీ కూనింటి శేఖర్ రెడ్డి విశిష్ట అతిథులుగా ఎస్సై హన్మాండ్లు భూపతి రాజు పాల్గొని ప్రసంగించారు ధ్యానం వల్ల కలిగే ఉపయోగాలని సందర్భంగా వివరించారు. ఈ సందర్భంగా 500 మంది ధ్యానులకు భోజనాన్ని అందించడం జరిగింది. ధ్యానం వల్ల ఆనందం, ఐశ్వర్యం ధ్యానం వల్ల ఆరోగ్యం కలుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత పంచాయతీ అధికారి దయానంద్, అమరావాజి శ్రీనివాసు, నారాయణ మల్యాల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.