
– నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయాలన్నదే నా లక్ష్యం ..
– తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం…
– మునుగోడు నియోజవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
నవతెలంగాణ- మునుగోడు
నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో అడగమని మునుగోడు ప్రజలు పంపితే అసెంబ్లీకి పోయి నిద్రపోయే ఎమ్మెల్యే మునుగోడు నియోజవర్గ ప్రజలకు అవసరమా అని మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పిఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం తను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతి సమస్యను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లాను కానీ అధికారంలో ఉన్న బిఆర్ఎస్ నియోజవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించలేదని అన్నారు . మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కెసిఆర్ నియంతృత పాలను అంతం చేయాలనే ఉప ఎన్నిక తెస్తే వందమంది ఎమ్మెల్యేలు , మంత్రులతో వచ్చి వందల కోట్లను వెదజల్లి తమపై యుద్ధం చేసిన మునుగోడు నియోజకవర్గ ప్రజలు 87 వేల ఓట్లు వేసి నైతిక విజయాన్ని అందించిన ప్రజల కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు . ఏంరా సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు ఆశించిన టికెట్టు రాకపోయినా కాంగ్రెస్ లోనే కష్టపడుతున్నారు కానీ 16 నెలలు పనిచేసిన చలమల కృష్ణారెడ్డి టికెట్ రాలేదని పార్టీ మారడం సరైంది కాదని అన్నారు. గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రజలంతా కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఆర్ గ్యారంటీల తో కాంగ్రెస్ పై ప్రజలలో విశ్వాసం పెరిగిందని అన్నారు. సోనియా గాంధీ పుట్టినరోజు నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చి గిఫ్టుగా ఇవ్వడంతోపాటు కెసిఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయమని తెలిపారు . వివిధ గ్రామాల సర్పంచ్ ఎంపీటీసీ వివిధ పార్టీ సీనియర్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు . ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పోలగొని సత్యం , మండల సీనియర్ నాయకులు నన్నూరు విష్ణువర్ధన్ రెడ్డి , కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్వాయి చెన్నారెడ్డి , సర్పంచ్ జాల ఎంకన్న యాదవ్ , మాజీ ఎంపీటీసీ జిట్టగోని యాదయ్య , మాజీ సర్పంచులు బూడిద లింగయ్యా యాదవ్ , పాలకూరి యాదయ్య గౌడ్ , దేశిడి యాదయ్య గౌడ్ , మాజీ మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఎండి అన్వర్ తదితరులు ఉన్నారు.