ప్రచార హోరు.. దూసుకెళ్తున్న కాంగ్రెస్ శ్రేణులు

-కాంగ్రెస్ పార్టీ పథకాల పై విస్తృత ప్రచారం
నవతెలంగాణ -తాడ్వాయి 
గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా మండలంలోని మేడారం, రెడ్డిగూడెం, కాలనీలలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దేవేందర్ సూచనల మేరకు, పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్, మండల గౌరవ అధ్యక్షులు అనంతరెడ్డి ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగా వెంకట్రాంరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు గడిగ అనిల్ మరియు తదితర కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో గురువారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న సంక్షేమ, ఆరు గ్యారెంటీ హామీలను, మరియు పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలు చేరాలనేదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ప్రజలు ఆశీస్సులతో రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పీరీల వెంకన్న, సీతక్క యువసేన జిల్లా అధ్యక్షులు చర్ప రవీందర్, మేడారం ఉపసర్పంచ్ గడిగ సంధ్యారాణి, నాయకులు ఆలకుంట రమేష్ పోలెబోయిన రాంబాబు, కాక కిరణ్, తీగల శ్రీనివాస్, గాదె కుమారస్వామి, సిద్దబోయిన సత్యవతి, గొంది సరిత, దేవులపల్లి రాజయ్య, అట్టం సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love