- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ నూతన సర్పంచ్ యెనుగందుల శైలేందర్ మంగళవారం మండల కేంద్రంలో తహసీల్దార్ గుడిమేల ప్రసాద్ ను కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ ప్రసాద్ ను శాలువతో సత్కరించారు. గ్రామంలో విద్యార్థులకు, సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు సత్వరం సర్టిఫికెట్ లు మంజూరు చేయాలని తహసీల్దార్ ప్రసాద్ ను సర్పంచ్ శైలేందర్ కోరారు.ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి శరత్, వార్డ్ సభ్యులు దాసరి రాకేష్, అజయ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు సుంకరి విజయ్ కుమార్, మారుపాక నరేష్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



