కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం

సాధారణంగా ఆహ్వానిస్తున్న దుద్దిళ్ల
నవ తెలంగాణ మల్హర్ రావు.
మండలంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి  కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో  కొనసాగుతోంది. ఆదివారం  వల్లెంకుంట, రుద్రారం గ్రామాలకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మంథని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీదర్ బాబు కాంగ్రెస్ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. చేరినవారిలో ఐత సమ్మిరెడ్డి, బండం సత్తిరెడ్డి, బొమ్మ శ్రీనివాస్ రెడ్డి, ఐత తిరుపతి రెడ్డి, దువాసి మొండయ్య, గానవేన రాజీరు, వేముల శంకర్, గడ్డం వెంకటేష్, గడ్డం, ఆదర్శ్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో  డీసీసీ అధ్యక్షుడు ప్రకాస్ రెడ్డి, మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్, కొండ రాజమ్మ,భోగే మల్లయ్య, చిగురు సదయ్య, జంగిడి సమ్మయ్య పాల్గొన్నారు.
Spread the love