- Advertisement -
నవతెలంగాణ – మెపాల్
బోర్గాం ( పి) శివారులో గల మోటాడి రెడ్డి సంఘంలో సంఘం సభ్యులు క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ .. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను విద్యారంగం తో పాటు ఉద్యోగ రంగంలో కూడా కల్పించాలని చాలామంది నిరుపేద రెడ్డి విద్యార్థులు ఉన్నారని అన్నారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిరుపేద రెడ్డిల కోసం 1000 నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు చామకూర సాయ రెడ్డి, ఉపాధ్యక్షులు ఈగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నారాయణరెడ్డి, చామకూర సాయి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సంగం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



