- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ హోంశాఖలో పోలీస్, జైళ్లు, అగ్నిమాపకశాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్) కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. దాదాపు 7 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 5 వేల పోలీస్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ కాగా.. మరో 2 వేల పోస్టుల కోసం ఉత్తర్వులు వెలువరించనుంది. వీటిలో ఎస్పీఎఫ్, జైళ్లశాఖ, అగ్నిమాపక శాఖలకు సంబంధించిన పోస్టులుండనున్నాయి. అనంతరం ఒకట్రెండు రోజుల్లోనే తెలంగాణ పోలీస్ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువరించనుంది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది. ఇది కొలిక్కి వచ్చిన వెంటనే నియామక ప్రక్రియ మొదలుకానుంది.
- Advertisement -



