Sunday, April 26, 2026
E-PAPER
Homeబీజినెస్ఐటీలో 7వేల ఉద్యోగాల కోత

ఐటీలో 7వేల ఉద్యోగాల కోత

- Advertisement -

– గతేడాది తగ్గిన సిబ్బంది
ఏఐ ప్రభావం..
బెంగళూరు :
భారత ఐటీ పరిశ్రమలో నియామకాలు అమాంతం పడిపోతున్నాయి. గడిచిన సంవత్సరం 2025-26లో దేశంలోని ఐదు ప్రధాన ఐటి కంపెనీలు తమ సిబ్బంది సంఖ్యను దాదాపు 7,000 మేర తగ్గించుకున్నాయి. గతంలో కేవలం ఉద్యోగుల సంఖ్య పెంచుకుంటూ పోయే స్కేల్‌ డ్రివెన్‌ వృద్ధి స్థానంలో ఇప్పుడు కంపెనీలు ఏఐ వినియోగం, పని సామర్థ్యాన్ని పెంచే ఎఫిషియెన్సీ ఫస్ట్‌ నమూనాకు ప్రాధాన్యతనిస్తున్నాయి. కంపెనీల వారీగా పరిశీలిస్తే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) అత్యధికంగా 23,460 ఉద్యోగాలను తగ్గించగా, టెక్‌ మహీంద్రా తన సిబ్బందిలో 1,108 మందిని తగ్గించుకుంది. మరోవైపు ఇన్ఫోసిస్‌ 5,016, విప్రో 8,810, హెచ్‌సీఎల్‌ టెక్‌ 3,761 చొప్పున నియామకాలు కొనసాగించినప్పటికీ.. అవి చాలా నియంత్రిత పద్ధతిలో సాగాయి. ఇంతక్రితం 2024-25లో ఐటీ కంపెనీలు 12,718 ఉద్యోగాలను సృష్టించాయి. 2023-24లో ఐటి రంగం ఏకంగా 69,000 ఉద్యోగాల కోతను చూసింది. దానితో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ వృద్ధిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం కంపెనీలు ఏఐ-నేటివ్‌ నిపుణులు, డేటా, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల కోసం వేట సాగిస్తున్నాయి. మరోవైపు, ప్రాజెక్టుల అమలులో జాప్యం కారణంగా ఐటీ స్టాక్స్‌ ఒత్తిడికి లోనవుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -