నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల పరిధిలోని అయ్యవారిపల్లి గేటు వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బీకే తిరుమాపూర్ గ్రామానికి చెందిన జటగోని రాజేష్ (15) హోండా షైన్ ఏపీ 22 ఏ ఆర్ 1778 బైక్‌పై అమ్రాబాద్ నుంచి కల్వకుర్తి వైపు వెళ్తుండగా, హజీపూర్ నుంచి డిండి రోడ్డువైపు వస్తున్న జల్ తండాకు చెందిన ధర్మ నాయక్ హోండా గ్లామర్ టీఎస్ 11 ఈ హెచ్ 9511 బైక్‌తో అదుపుతప్పి ఢీకొట్టారు.
ఈ ప్రమాదంలో మైనర్ అయిన రాజేష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ధర్మ నాయక్ గాయాలతో బయటపడినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి తండ్రి అమాబైహ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతున్నట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.



