ఆయుష్మాన్ ఖురానా హీరోగా యశ్ రాజ్ ఫిల్మ్స్, పోషమ్ పా పిక్చర్స్ బ్యానర్స్‌పై రూపొందుతున్న చిత్రం ‘ముపాపా’. యశ్ రాజ్ ఫిల్మ్స్ సిఇఒ అక్షయ్ విదాని ఈ మూవీని నిర్మిస్తున్నారు. షో రన్నర్, డైరెక్టర్ సమీర్ సక్సేనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన నిర్మించిన గత చిత్రం ‘సయారాహయ్యస్ట్ గ్రాసర్ సాధించిన రొమాంటిక్ మూవీగా ఇండియన్ సినిమాలో రికార్డ్ క్రియేట్ చేసింది. 'ముపాపా చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలియజేశారు. ఇండియన్ ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న పోషమ్ పా పిక్చర్స్ నేటి తరం ప్రేక్షకులకు భిన్నమైన, సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించాలనే లక్ష్యంతో యశ్ రాజ్ ఫిల్మ్స్‌తో కలిసి సినిమాలను నిర్మించనుంది. అందులో భాగంగా ఈ సినిమా ప్రారంభమవుతోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్‌లో కొత్త క్రియేటివ్ బిజినెస్ మోడల్‌ను నిర్మించే ఆదిత్య చోప్రా విజన్‌కు అనుగుణంగా ఈ భాగస్వామ్యం ఉంది. కంపెనీ సీఈఓ అక్షయ్ విదాని నేతృత్వంలో.. ఆయన నిర్మాతగా స్టూడియో ఈ మోడల్‌ను వ్యూహాత్మకంగా అభివృద్ధి చేస్తున్నారు. మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ మూవీ ‘సయారా` తర్వాత నిర్మాతగా అక్షయ్ విదాని చేస్తున్న రెండో సినిమా ఇది. ఇదొక వినూత్నమైన థియేట్రికల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలో ప్రేక్షకులకు పూర్తిగా కొత్త విaజువల్ అనుభూతిని అందించనుంది. ఇక మరోమారు ఆయుష్మాన్ తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నారు. కాలా పానీ, మామ్లా లీగల్ హైస వంటి ప్రేక్షకాదరణ పొందిన సినిమాల్లో భాగమైన పోషమ్ పా పిక్చర్స్ పార్ట్‌నర్స్ సమీర్ సక్సేనా, బిస్వపతి సర్కార్, సౌరభ్ ఖన్నా, అమిత్ గోలాని ఇందులోనూ భాగమయ్యారు.
సరికొత్తగా ‘ముపాపా`
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



