ఆధునిక కాలంలోనూ మూఢనమ్మకాలను ఎండ గట్టే కథనంతో తెలుగు తెరపైకి ఓ సినిమా రాబోతుంది. రాజేష్ భూపతి, స్వప్నరాజ్, అబిత హీరో హీరోయిన్లుగా, సుమన్, ఆమని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బి.వి.సి ఫిల్మ్స్ బ్యానర్‌పై, 'ఇట్లు' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న రోశిరెడ్డి పందిళ్లపల్లి దర్శకుడిగా చేస్తున్న ఈ విభిన్న కథా చిత్రం 'నిమ్మకాయ.. నీకెందుకు భయం' ఘనంగా ప్రారంభమైంది. సారథి స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించి చిత్రాన్ని లాంఛనంగా ప్రారం భించారు. ముహూర్తపు సన్నివేశానికి పీసీసీ జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా క్లాప్ కొట్టారు. లయన్ వెంకట్ కెమెరా స్విచ్ ఆన్ చేయాగా, తొలి షాట్ కు టీఎఫ్‌సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ దర్శకత్వం వహించారు. దర్శకుడు రోశిరెడ్డి పందిళ్లపల్లి మాట్లాడుతూ, 'ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొంది స్తున్నాం. 'నిమ్మకాయ' చుట్టూ ఉన్న అపోహలను కథాంశంగా తీసుకుని వినోదాత్మకంగా, ఆలోచిం పజేసేలా సినిమాను తెరకెక్కిస్తున్నాం. కథలో ఎక్కువ భాగం నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఉంటుంది అని తెలిపారు. ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించ నున్నట్లు నిర్మాతలు తెలిపారు.
ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: రోశిరెడ్డి పందిళ్లపల్లి, మ్యూజిక్ : వరికుప్పల యాదగిరి, డీఓపీ : డి. యాదగిరి, ఫైట్స్: పి.సతీష్, లిరిక్స్: చింతపల్లి విజయ్ కుమార్, డైలాగ్స్: మదన్, ఆర్ట్: విజయ్ కృష్ణ.
‘నిమ్మకామ.. నీకెందుకు భయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



