Sunday, May 17, 2026
E-PAPER
Homeదర్వాజసాహితీ వార్తలు

సాహితీ వార్తలు

- Advertisement -

యువ రచయితలకు
కథా, కవితా రచనలపై కార్యశాల

యువ రచయితల్లో సృజనాత్మక రచనా నైపుణ్యాలను పెంపొందించేందుకు ఎస్వీ యూనివర్సిటీ ప్రాచ్యపరిశోధనా సంస్థ సౌజన్యంతో, సాహితీ స్రవంతి మరియు వేమన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 28న ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 5.30 వరకు ప్రత్యేక కార్యశాల ఎస్వీ యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్మెంట్‌ సెమినార్‌ హాల్లో నిర్వహిస్తారు. ఓ. వెంకటరమణ, ఆచార్య రాజేశ్వరమ్మ, కెంగార మోహన్‌, ఆర్‌.ఎం. ఉమామహేశ్వరరావు, పలమనేరు బాలాజీ, మధురాంతకం నరేంద్ర, ఆచార్య పి.సి. వెంకటేశ్వర్లు, ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు పాల్గొంటారు. యువ రచయితలతో ప్రత్యక్ష చర్చలు, వారి స్పందనలు, సందేహ నివృత్తి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. పాల్గొనేవారు 25-04-2026 లోపు 9398000686/ 9494512930 నంబర్లకు వాట్స్‌ యాప్‌ ద్వారా నమోదు చేసుకోవాలి.
వేమన విజ్ఞాన కేంద్రం, సాహితీ స్రవంతి, తిరుపతి

‘కుమ్మరికుంటోని కథలు’
కథా సంపుటి ఆవిష్కరణ

తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో డా. చెమన్‌ రచించిన ‘కుమ్మరికుంటోని కథలు’ కథా సంపుటి ఆవిష్కరణ ఈ నెల 28 సాయంత్రం 5.30 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. దేశపతి శ్రీనివాస్‌, డా. నందిని సిధారెడ్డి, ప్రొ. కాశీం, డా. ఏనుగు నరసింహ రెడ్డి, డా. నామోజు బాలాచారి ,పెద్దింటి అశోక్‌ కుమార్‌, స్వర్ణ కిలారి, బుర్ర తిరుపతి, బెజ్జారపు వినోద్‌ కుమార్‌, ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొంటారు. సాహితీమిత్రులు, భాషాభిమానులందరికీ ఆత్మీయ ఆహ్వానం.
ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌

డా.రావులపాటి సీతారాంకు చింతలపల్లి నిర్మలాదేవి-నారాయణ రావు జీవనసాఫల్య పురస్కారం
ఈ నెల 30న సాయంత్రం 5గంటలకు తెలంగాణ సారస్వత పరిషత్‌ తిలక్‌ రోడ్‌ హైదరాబాద్‌ నందు రావులపాటి సీతారాం కు చింతలపల్లి నిర్మలాదేవి నారాయణరావు జీవన సాఫల్య పురస్కారంతో పాటు నగదు ప్రదానోత్సవం చేస్తున్నారు. ఈ సమావేశానికి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, ఆచార్య కాత్యాయనీ విద్మహే, ప్రసేన్‌ బెల్లంకొండ, డా.యస్‌.రఘు, యాకూబ్‌, డా.పసునూరి రవీందర్‌, రవి మారుత్‌, వనపట్ల సుబ్బయ్య హాజరవుతారు.
సి.ఎన్‌.ఆర్‌ విద్యాసంస్థలు నాగర్‌ కర్నూల్‌, వనపట్ల సుబ్బయ్య, 9492765358

లామకాన్‌-మరువం కార్యక్రమం
బమ్మిడి జగదీశ్వర రావు సేకరించి, రచించిన కథలు ‘ఊరవతల దీపాల ఊసులు’ (కళింగాంధ్ర జానపద కథల తళుక్కులు!) ‘ధ్వని’ (నిండైన శ్రవ్య-రూప అనుభవం) కార్యక్రమం ఈ నెల 30న సాయంత్రం 7 గంటలకు లామకాన్‌, జి.వి.కె.మాల్‌ ఎదురు సందులో, రోడ్‌ నెం.1, బంజారా హిల్స్‌, హైదరాబాద్‌ నందు నిర్వహిస్తున్నారు. ఇందులో బమ్మిడి జగదీశ్వరరావు, ల.లి.త., సుమనస్పతి పాల్గొంటారు.

అమృతలత – అపురూప అవార్డు ప్రదానోత్సవం – 2026

అమృతలత – అపురూప అవార్డు ప్రదానోత్సవం2026 కార్యక్రమం మే నెల 10వ తేదీన హైదరాబాద్‌ సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీలో సాయంత్రం 4.30 గంటలకు జరుగుతుంది. డా.జి.రాధారాణి, మంజుభార్గవి హాజరవుతారు. ‘లలిత సంగీతం’ విభాగంలో డా.డా.హైమతీ భీమ్మన్న, ‘నవలా రచన’ విభాగంలో డా.పెళ్లకూరు జయప్రద, ‘శాస్త్రీయ సంగీతం’ విభాగంలో బుర్రా వరహాలు అమతలత జీవన సఫల పురస్కారాలను అందుకుంటారు. యు.కె.ఆర్‌.ఆశాలత (వ్యాఖ్యానం), పుట్టి నాగలక్ష్మి (స్టాంపుల సేకరణ), డా. దేవులపల్లి వాణిదేవీ (కవితా విభాగం), డా.మైథిలి అబ్బరాజు (కథారచన), డా||తంగెళ్ల శ్రీదేవిరెడ్డి (వ్యాసరచన), భావరాజు పద్మినీ ప్రియదర్శిని (సాహితీసంస్థ నిర్వహణ), అంజలి (ఎలక్ట్రానిక్‌ మీడియా), ఎస్‌.మాధవి (రంగస్థలం), రేలారే రేలా గంగ (జాననపద గీతాలు) విభాగాలలో అపురూప అవార్డులు అందుకోనున్నారు.
నెల్లుట్ల రమాదేవి, కన్వీనర్‌, 9440622781

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -