అప్రియమైన విషయాన్ని ప్రియంగా చెప్పడానికి వాడే పదాన్ని గానీ, పదబంధాన్ని గానీ యూఫెమిజం అంటాము. Saying unpleasant things in a pleasant way అని డిక్షనరీ వివరణ. అసహ్యకరమైన, అమర్యాదపూర్వక, నిషిద్ధ విషయాన్ని సభ్య సమాజం మెచ్చుకునే రీతిలో పరోక్షంగా మృదువైన మాటల్లో చెప్పడానికి ఉపయోగించే మాటే సభ్యోక్తి, ప్రియోక్తి, శిష్టోక్తి.
నిత్యజీవితంలో తరచుగా అనేక అప్రియమైన విషయాలను వినేవారికి యిబ్బంది కలిగించని రీతిలో చెప్పుకుంటాము. చనిపోవడం, శృంగారం, వ్యభిచారం, జైలుకు వెళ్ళడం, స్త్రీపురుష జననాంగాలు, తాగుడు, లంచం, అక్రమసంపాదన, డబ్బు, అవినీతి, పోలీసు, రాజకీయ వ్యవస్థల్లాంటి విషయాలకు యూఫెమిజాలు పెద్ద సంఖ్యలో కన్పిస్తాయి. చనిపోవడానికి మరణం, దివంగతులు, కీర్తిశేషులు పరమపదం, కైవల్యప్రాప్తి, భవబంధ విముక్తి, తుదిశ్వాస విడవడం, మరి ఇక లేరు మొదలైన మాటలెన్నో?యూఫెమిజం ప్రయోగించే వ్యక్తుల సంస్కారాన్ని, మర్యాదను, వారి సాంఘిక స్థాయిని తెలియజేస్తుంది.
వృద్ధులు సీనియర్ సిటిజన్స్ గౌరవించబడితే, అపరిచిత ఆడ మగ వ్యక్తులు అంటీలు, అంకుల్స్ గా పరిగణించబడతారు. వికలాంగులు, దివ్యాంగులుగా differently abled గా, పొట్టివారు Virtically challenged nr 2 2 slow Learners , economically backword గా మారిపోతారు. ఏదైనా పని చేయడంలో, కార్యరంగంలో ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యలకు challenges మాట యూఫమిజం.
వృత్తి, కులం చెప్పుకోవడానికి వెనకాడే స్థితినుండి SC, ST, BC మాటలు విముక్తి కలిగించాయి. ఒకప్పుడు ససమాజంలో చిన్న చూపుకు గురియైన వర్గం ఇప్పుడు LGBTQ లుగా తలెత్తుకుని జాతీయ, అంతర్జాతీయ సమ్మేళనాలు జరుపుకునే వెసులుబాటు కలిగింది. స్వలింగ వివాహాలు చట్ట బద్ధం ఐనాయి.
పల్లె ప్రాంతంలో గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఎవరేమి చేసేదీ అందరికి తెలుస్తుంది. కానీ పట్టణాల్లో మన ఇరుగు పొరుగు వాళ్లు ఏమిచేసేది తెలియదు. ఉద్యోగాలు చేయరు. మరి వారేమి చేస్తారో? ఎవర్నడిగినా ‘Business’ అనేది జవాబు.
కాలాను గుణంగా కొత్తవృత్తులు, కొత్త జీవన శైలులు పుట్టుకొస్తే వావాటితో పాటు కొత్త యూఫెమిజాలు పుట్టుకొస్తాయి. అవివాహిత యువతీ యువకులు boy friends, girl friends ను కలిగి వుండడం గర్వకారణం. నిజానికది వివాహపూర్వ సంబంధాలను, beau, mistress, affair లాంటి మాటలు వివాహేతర సంబంధాలను తెలిపే యూఫమిజాలు. Call girls, Single parents, pillow/bed partners సహజీవనం మొదలైనవి నూతన జీవన శైలిని తెలిపే మాటలు.
రాజకీయాల్లో ఉచితాలన్నీ ఓటర్లను మభ్యపెట్టే లంచాలే, వాగ్దానాలన్ని అచరణ సాధ్యంకాని బూటకపు మాటలే భారీఎత్తున జరిగే ఆర్థిక దోపిడీలన్నీ స్కాంలు (Scams) ఐతే విచారణ కమిటీలు, కమిషన్లు ప్రజాదృష్టిని మరల్చే మార్గాలు. సమస్యను నాన బెట్టడానికి ‘అధ్యయనాలు”, అధ్యయనం చేయడానికి విదేశీ పర్యటనలు అవసరమవుతాయి. పార్టీలో తిరుగు బాటు ‘అసమ్మతి వర్గం’ గా గుర్తింపు పొందుతుంది. నిధుల్ని మింగేయడం, భోంచేయడం, గడ్డిమేయడం, ఖజానా ఖాళీచేయడం రాజకీయాల్లో సర్వ సాధారణమైంది.
చిన్నిల్లు, హనీట్రాప్, సీతాకోకచిలుక, పూలరంగడు, కాలుజారడం, మన్మధ భాష, అనంగరంగభాష మొదలైన అందమైన పేర్లను తరచూ వింటాము. గృహిణిని Housewife అంటే, ఇప్పుడు ఇంటిని చక్క దిద్దే బాధ్యతను (ఉద్యోగం చేస్తున్న భార్యల నిరుద్యోగ భర్తలు తీసుకుంటారు). లింగవివక్షకు తావులేని Home maker అంటున్నాము. భార్యాభర్తలను Life partners అంటాము. ఒకప్పుడు బస్ స్టేషన్లు రైల్వేస్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో కన్పించిన Toilets, Lavetories ఇప్పుడు Restrooms / Wash Areas గా పరివర్తన చెందాయి.
పనీపాటా లేకుండా గాలికి తిరిగే వాణ్ణి Air Force లో పనిచేస్తున్నాడని, గూండా గిరీ చేస్తూ పోలీసుల చేతుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్ళివచ్చినవాడికి రాజకీయ నాయకునిగా ఎదిగే లక్షణాలు న్నాయనడం, నగ్నంగా కనిపించే చిన్న పిల్లల్ని Birthday Suit లో ఉన్నారనడం హాస్యప్రియత్వానికి ఉదాహరణలు.
యూఫెమిజమ్కు వ్యతిరేకం dysphemism. అప్రియమైన విషయాన్ని అప్రియంగానే చెప్పడం, అశ్లీల, అసభ్య పదాలను అలాగే వాడడం దీని లక్షణం. కోపాన్ని, అధికార దర్పాన్ని, అహంకారాన్ని ప్రదర్శించడానికి ఇది ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఆత్మీయ స్నేహితుల మధ్య, తల్లి దండ్రులు అభిమానంగా చూసుకునే సంతానం పట్ల డిస్పమిజం వాడటం వింటాము. డాక్టరు Quack, Banker 5 Fat cat, Scribbler, Hack, Ambulance chaser, జడ్డ్జికి Beak అమిత చదువరికి Book worm మొదలగునవి డిస్పమిజాలు, ఐతే వీటి వాడకం పరిమితం.
యూఫెమిజం ప్రయోగించడం మాట్లాడేవారి వ్యక్తిత్యాన్ని, సంస్కారాన్ని, స్థాయిని తెలుపుతుంది. యూఫెమిజాలు – సభ్యోక్తులు, (శిష్టోక్తులు, ప్రియోక్తులు) భాషా సంపదను పెంచి దానికి జవసత్వాలనిస్తాయి. భాషా సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి. వక్తకు గౌరవాన్ని, శ్రోతకు శ్రవణానందాన్ని కలిగిసస్తాయి.
‘ప్రియమ్ బ్రూయాత్, నబ్రూయాత్ సత్యమిప్రియమ్’ సూక్తిని మన స్మృతి ఎప్పుడో చెప్పింది.
టి.వి.ప్రసాద్, 79813 98250
సభ్యోక్తి (Euphemism)
- Advertisement -
- Advertisement -



