- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే ప్రజా సంక్షేమం, అభివృద్ధి జరిగిందని మద్నూర్ మండల బీఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ వై గోవింద్ అన్నారు. సోమవారం బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండలంలోని మేనూర్ గ్రామంలో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి జరిగిందని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ప్రజా సంక్షేమం కుంటుపడుతుందని విమర్శించారు. కార్యక్రమంలో మండల కో ఆప్షన్ మాజీ మెంబర్ నిజాముద్దీన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -



