సంక్షోభంలో పెట్టుబడిదారీ వ్యవస్థ
పొరాటాల కాలం..
జనంలో ఉండి పనిచేయాలి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
‘మన స్థాయిలో మరో సుందరయ్య’ పుస్తకావిష్కరణ
నవతెలంగాణ- వైరాటౌన్
సామ్రాజ్యవాద విధానాలు ప్రపంచవ్యాప్తంగా సమస్యలను సృష్టిస్తున్నాయని, పెట్టుబడిదారీ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు అన్నారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని లాలాపురం గ్రామంలో సోమవారం మార్క్సిస్టు పోరాట యోధుడు సంక్రాంతి మధుసూదన్‌రావు ప్రథమ వర్థంతి జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం స్మారక స్థూపం వద్ద పార్టీ పతాకాన్ని ఎగురవేసి, నాయకులు నివాళులర్పించారు. సభలో సంక్రాంతి మధుసూదన్‌రావు జీవిత చరిత్ర ‘మన స్థాయిలో మరో సుందరయ్య’ పుస్తకాన్ని బివి.రాఘవులు ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. సోషలిజాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించిన సామ్రాజ్యవాద దేశాలు నేడు తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ప్రపంచ దేశాలు అమెరికా ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నాయని చెప్పారు.
అమెరికా యుద్ధ విధానాల వల్ల గ్యాస్, డీజిల్, పెట్రోల్ కొరతతో ధరలు పెరిగి ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సామ్రాజ్యవాద దేశాలకు సోషలిస్టులంటే భయం ఉందని, అందుకే క్యూబాపై ఆంక్షలు విధిస్తున్నాయని విమర్శించారు. అంతర్జాతీయ రాజకీయాల ప్రభావంతో ఇంధన దిగుమతుల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. ప్రజలపై భారాలు మోపుతోందని అన్నారు. మహిళా బిల్లును సంవత్సరాలుగా అమలు చేయకుండా ఇతర అంశాలతో అనుసంధానం చేయడం మహిళలకు అన్యాయం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతి మధుసూదన్‌రావు ఉద్యమాల కాలంలో పెరిగి, పోరాటాల్లో పాల్గొన్న నాయకుడని గుర్తుచేస్తూ, మార్పు పట్ల విశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. రాబోయే కాలం పోరాటాల కాలమని, పార్టీ నాయకులు ప్రజల్లో ఉండి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఆర్థిక విధానాలు ప్రమాదకరం : విజ్జూ కృష్ణన్
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సరళీకరణ ఆర్థిక విధానాలు దేశానికి ప్రమాదకరమని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు విజ్జూ కృష్ణన్ అన్నారు. ఈ విధానాల కారణంగా బీజేపీ పాలనలో లక్షలాది మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, మోడీ పాలనలో ఆదివాసీలు, దళితులపై దాడులు పెరిగాయని చెప్పారు. ఢిల్లీ రైతు పోరాటం సమయంలో వందలాది మంది రైతులు ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడారని గుర్తు చేస్తూ, వారి ఐక్య పోరాటం కారణంగా కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. సంక్రాంతి మధుసూదన్‌రావు వంటి కవ¶్యనిస్టు యోధుల పోరాట చరిత్రను నాయకత్వం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఉత్తమ కమ్యూనిస్టు నాయకుడు : ఎంపీ మల్లు రవి
సంక్రాంతి మధుసూదన్‌రావులో ఉత్తమ కమ్యూనిస్టు లక్షణాలన్నీ ఉన్నాయని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. కుల వివక్ష ఎక్కువగా ఉన్న కాలంలోనే మధుసూదన్‌రావు కుటుంబం తనను సమానంగా చూసిందని గుర్తు చేసుకున్నారు. ఆదర్శ వివాహాలు జరిపిస్తూ ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా పనిచేశారన్నారు. సెక్యులరిజం, సోషలిజం, సోషల్ జస్టిస్ కోసం కమ్యూనిస్టులు చేస్తున్న కష్టం, త్యాగం ప్రశంసనీయమని అన్నారు. బీజేపీ పాలన దళితులు, గిరిజనులు, మహిళలకు వ్యతిరేకంగా ఉందని, డీలిమిటేషన్ వల్ల దక్షిణ భారతదేశానికి నష్టం కలిగే అవకాశం ఉందని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ఇండియా కూటమి ఐక్యతతో ముందుకు సాగాలని కోరారు.
ఆయన ఆదర్శ విప్లవ కమ్యూనిస్టు : పోతినేని
వినియోగదారీతత్వం, పదవీ వ్యామోహం, కుల, మత అస్తిత్వాలు, ఇతర పాలక రాజకీయ పార్టీల రాజకీయాల ప్రభావం పార్టీ క్యాడర్, నాయకులపై కూడా పడుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. ఇటువంటి ప్రతికూల ధోరణుల నుంచి బయటపడటానికి మధుసూదన్‌రావు జీవిత చరిత్రను తప్పనిసరిగా అధ్యయనం చేయాలని సూచించారు. ఆదర్శ విప్లవ కవ¶్యనిస్టు నాయకుడు మధుసూదన్‌రావు అని కొనియాడారు.
కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు పి.సోమయ్య, మాచర్ల భారతి, జేవీవీ రాష్ట్ర నాయకులు మల్లెంపాటి వీరభద్రం, సీనియర్ నాయకులు మన్నెపల్లి సుబ్బారావు, బోడేపూడి విజ్ఞాన కేంద్రం వై.శ్రీనివాసరావు, వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, మెరుగు సత్యనారాయణ, యర్ర శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మతోన్మాద రాజకీయాలు ప్రమాదకరం : తమ్మినేని
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, మతోన్మాద రాజకీయాలు దేశానికి తీవ్ర ప్రమాదకరమని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. ట్రంప్‌నకు మోడీ బానిసత్వం చేయడం వల్ల ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశాన్ని భారత్ కోల్పోతుందన్నారు. ప్రజల్లో ఉండి పని చేయడమే కవ¶్యనిస్టుల అసలు ధోరణి అని, అలా ప్రజల్లో మమేకమై పోరాడిన యోధుడు సంక్రాంతి మధుసూదన్‌రావు అని తెలిపారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా వర్గ స్వభా వాన్ని విడిచిపెట్టి కార్మికవర్గ భావజాలంతో నిరంతరం కృషి చేసిన నాయకుడిగా ఆయన నిలిచారని, ”మన స్థాయిలో మరో సుందరయ్య”గా ఆయనను అభివర్ణించారు.



