యుద్ధంలో తీవ్రంగా నష్ట పోతున్న అమెరికా
వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధం వల్ల అమెరికాకు ఊహించిన దానికంటే ఎక్కువ నష్టమే వాటిల్లుతోంది. ఇప్పటికే అగ్రరాజ్య క్షిపణి నిల్వలు భారీగా కరిగిపోతున్నాయి. మరోవైపు, ఇతర ప్రాంతాల్లో మోహరించిన సైన్యాన్ని పశ్చిమాసియాకు తరలిస్తుండ టంతో అమెరికా కు కొత్త ముప్పులు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తైవాన్ ఆక్రమణపై చైనా కన్నేసిన వేళ.. ఇండో-పసిఫిక్ ప్రాంతం లోని అమెరికా సైనిక సామర్థ్యాలను పశ్చిమాసియాలో వృథా చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విష యాన్ని అమెరికా ఇండో-పసిఫిక్ కమాండర్ అడ్మిరల్ శామ్యూల్ జె పాపారో వెల్లడించారు. ఇటీవల యూఎస్ కాంగ్రెషనల్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ కమిటీ విచారణకు హాజరైన శామ్యూల్.. పశ్చిమాసి యాలో ఉద్రిక్తతల గురించి మాట్లా డారు. పసిఫిక్ మహా సముద్రంలో చైనా నుంచి పొంచిఉన్న ముప్పు గురించి ఆందోళన వ్యక్తంచేశారు. భవిష్య త్తులో చైనాతో యుద్ధం ఎదురైతే.. క్షిపణుల అవసరం ఎక్కువగా ఉంటుందని శామ్యూల్ తెలిపారు. కానీ, ఇప్పుడు ఇరాన్ తో యుద్ధం కారణంగా క్షిపణి నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయన్నారు. చైనా వద్ద పెద్ద సంఖ్యలో క్షిపణి నిల్వలు ఉన్నాయి. తైవాన్ విష యంలో అగ్రరాజ్యంతో ఉద్రిక్తతలు రాజుకుంటే.. ఆసియా-పసిఫిక్ ప్రాంతం లోని అమెరికా, దాని మిత్ర దేశాల స్థావరాలను బీజింగ్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉన్న విషయాన్ని అగ్రరాజ్య కమాండర్ గుర్తుచేశారు. ఇక,ఇదే విచారణలో డెమోక్రటిక్ సెనెటర్ రిచర్డ్ బ్లూమెంథల్ మాట్లాడుతూ.. ”ఇరాన్‌తో యుద్ధం మన సైనిక సామర్థ్యా లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్టు కన్పిస్తోంది. ఇప్పటికే జపాన్‌లోని యూఎస్ మెరైన్ కోర్ యూనిట్‌ను పశ్చిమాసియాకు తరలించారు. అమెరికా యుద్ధ విమాన వాహక నౌక అబ్రహం లింకన్ కూడా పశ్చి మాసియాలోనే విధులు నిర్వర్తిస్తోంది. ఇవన్నీ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు ఆందోళన కలిగించే అంశాలే” అని పేర్కొన్నారు. మరోవైపు ఛాబహార్ పోర్టును అమెరికా దిగ్బంధనం చేసింది. దీంతో భారీ పరిణామంలో భారీ నౌకలు నిలిచిపోయాయి.
రోజుకు బిలియన్ డాలర్లు..
ఇరాన్‌తో యుద్ధానికి అమెరికా సైనిక వ్యయం నానాటికీ పెరుగుతోంది. టెహ్రాన్‌ను ఎదుర్కొనేందుకు అగ్రరాజ్యం రోజుకు ఓ బిలియన్ డాలర్ల మేర వెచ్చిస్తోన్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. దీనిపై స్వదేశంలోనూ పెద్దఎత్తున వ్యతిరేకత ఎదురవుతోంది. పశ్చిమాసియాలో యుద్ధం నుంచి అమెరికా ఉన్నట్టుండి వెనక్కి తగ్గే అవకాశం కన్పించట్లేదు. దీంతో తాను సృష్టించిన యుద్ధంలో.. తానే ఇరుక్కొన్నట్లయ్యింది ట్రంప్ పరిస్థితి..!.



