Thursday, April 30, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా పాస్‌పోర్టుపై ట్రంప్‌ చిత్రం

అమెరికా పాస్‌పోర్టుపై ట్రంప్‌ చిత్రం

- Advertisement -

వాషింగ్టన్‌ : అమెరికా ఈ సంవత్సరం జులైలో 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆ దేశ పాస్‌పోర్టులపై అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చిత్రాన్ని ముద్రిస్తున్నారు. దీనికి సంబంధించిన చిత్రాలను శ్వేతసౌధం, విదేశాంగ శాఖ మంగళవారం విడుదల చేశాయి. పాస్‌పోర్టుపై అధ్యక్షుని సంతకం కూడా ఉంటుంది. ‘జులైలో అమెరికా తన 250వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన పాస్‌పోర్టులను పరిమిత సంఖ్యలో విడుదల చేస్తాం’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగ్గట్‌ చెప్పారు. వాషింగ్టన్‌ పాస్‌పోర్ట్‌ ఏజెన్సీ ద్వారా దరఖాస్తు చేసుకునే అమెరికా పౌరులకు అది అందుబాటులో ఉంటుంది. ఈ వేసవిలో ప్రత్యేక పాస్‌పోర్టుల పంపిణీ ప్రారంభమవుతుందని, సరఫరా నిలిచిపోయే వరకూ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అమెరికా పాస్‌పోర్టులో దేశ చరిత్ర, గుర్తింపునకు సంబంధించిన చిత్రాలు మాత్రమే ఉన్నాయి. పాస్‌పోర్టుపై దేశాధ్యక్షుడి ఫొటోను ముద్రించడం అమెరికాలో ఇదే మొదటిసారి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -