Thursday, April 30, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థపై అమెరికా కన్నెర్ర

ఇరాన్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థపై అమెరికా కన్నెర్ర

- Advertisement -

పలు సంస్థలపై ఆంక్షలు
వాషింగ్టన్‌ : ఇరాన్‌ సాయుధ దళాలు, క్షిపణి కార్యక్రమాలు, ప్రాంతీయ ఉగ్రవాద ముసుగు సంస్థలకు నిధులు సమకూర్చడానికి ఆ దేశానికి చెందిన రహస్య షాడో బ్యాంకింగ్‌ వ్యవస్థ (సంప్రదాయ బ్యాంకింగ్‌ నియంత్రణ, పర్యవేక్షణ వెలుపల పనిచేసే వ్యవస్థ. అంటే బ్యాంకింగ్‌ యేతర ఆర్థిక సంస్థలు, హెడ్జ్‌ ఫండ్స్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులు, మనీ మార్కెట్‌ ఫండ్స్‌్‌ వంటివి) అనేక మిలియన్‌ డాలర్లను తరలిస్తోందని ఆరోపిస్తున్న అమెరికా ఆర్థిక శాఖ పరిధిలోని విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం (ఓఎఫ్‌ఏసీ) దానిలో కీలక పాత్ర పోషిస్తున్న 35 సంస్థలు, వ్యక్తులను గుర్తించింది. వాటిపై ఆంక్షలు విధించింది. ఇరాన్‌ షాడో బ్యాంకింగ్‌ వ్యవస్థ ఆ దేశ సాయుధ దళాలకు ఓ కీలక ఆర్థిక జీవనాధారంగా పనిచేస్తోందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెస్సెంట్‌ ఆరోపించారు. ఈ వ్యవస్థతో సంబంధం పెట్టుకునే ఏ సంస్థ అయినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అమెరికా తాజా చర్యతో 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకూ ఇరాన్‌కు సంబంధించిన సుమారు వెయ్యి సంస్థలు ఆంక్షలకు గురయ్యాయి. తాజాగా ఆంక్షలకు గురైన సంస్థలు, వ్యక్తులకు అమెరికాలో ఉన్న ఆస్తులన్నింటి పైనా నిషేధం విధించారు. ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) సహా ఇరాన్‌ సాయుధ దళాలు అక్రమ చమురు అమ్మకాల ద్వారా నిధులు పొందుతున్నాయని, ఇరాన్‌ ఉగ్రవాద ముసుగు సంస్థలకు నిధులు బదిలీ చేస్తున్నాయని, ఈ కార్యకలాపాలకు ఆయా సంస్థలు సాయపడుతున్నాయని అమెరికా ఆరోపిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -