Friday, May 1, 2026
E-PAPER
Homeసినిమాకొత్త అఖిల్‌ని చూస్తారు

కొత్త అఖిల్‌ని చూస్తారు

- Advertisement -

అఖిల్‌ అక్కినేని కొత్త సినిమా ‘లెనిన్‌’ నుంచి ఇప్పటి వరకు ‘వారెవా వారెవా..’ , ‘ఎట్టా ఎట్టా..’ అనే రెండు సాంగ్స్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రెండు చార్ట్‌బస్టర్‌ సాంగ్స్‌ మంచి హైప్‌ను క్రియేట్‌ చేశాయి. తమన్‌ సంగీత సారథ్యంలో విడుదలైన ఈ పాటలు అందరి దష్టిని ఆకర్షించి, సినిమాపై పాజిటివ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. ఇటీవల నాగార్జున ఈ సినిమా ఫస్ట్‌ కాపీని చూసి, సినిమా అవుట్‌పుట్‌తో పాటు టీమ్‌ పనితీరుపై చాలా ఇంప్రెస్‌ అయ్యారు. అంతే కాకుండా, నిన్న సినిమా చూశానని, ఎంతో నచ్చిందని తన ఎక్స్‌ అకౌంట్‌ (ట్విట్టర్‌)లో ట్వీట్‌ ద్వారా తెలియ జేశారు. ఈ సినిమాతో జూన్‌ 26న థియేటర్లలో ప్రేక్షకులు ‘కొత్త అఖిల్‌’ను చూడబోతున్నారని కూడా ఆయన హామీ ఇచ్చారు. ‘నిన్న రాత్రి మా లెనిన్‌ సినిమా ఫస్ట్‌ కట్‌ చూసాను. నమ్మకంతో, గర్వంతో చెబుతున్నాను. జూన్‌ 26న మీరు ఒక కొత్త అఖిల్‌ను చూడబోతున్నారు. ఆ తేదీని గుర్తుంచుకోండి. థియేటర్లలో కలుద్దాం’ అని నాగార్జున తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ మెసేజ్‌ అక్కినేని ఫ్యాన్స్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. అఖిల్‌ పెర్ఫామెన్స్‌ను సిల్వర్‌ స్క్రీన్‌పై చూసి సెలబ్రేట్‌ చేయటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా అఖిల్‌కు పెద్ద బ్రేక్‌ అవుతుందని మేకర్స్‌ భావిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బలమైన భావోద్వేగాలు, ఆకట్టుకునే కథతో పూర్తి ఎంటటైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ చిత్రం జూన్‌ 26న థియేటర్లలో విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్‌ ఎల్‌ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -