హీరో శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది కాంబోలో రూపొందు తున్న పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ సినిమా ‘భోగి’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ అనుపమ పరమేశ్వరన్ పాత్రను పరిచయం చేస్తూ కందుల సులోచన రాణిగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అనుపమ పల్లెటూరి యువతిగా సహజసిద్ధమైన లుక్‌లో కనిపిస్తుంది. మోదుగ ఆకులుతో ఆకుపళ్లెం తయారు చేస్తూ జీవనం సాగించే సులోచన పాత్రలో అనుపమ పూర్తిగా లీనమయ్యారు. ప్రకతితో ముడిపడి ఉన్న ఈ పాత్రలో ఆమె సహజత్వం, ధైర్యం, బలం ప్రతిబింబిస్తున్నాయి. గంగా అనే తుఫాన్‌లాంటి పాత్రకు ఆత్మలా నిలిచే సులోచన ఈ కథలో కీలక పాత్రగా ఉండనుంది. ఇప్పటికే రాజమహేంద్రవరం, రంపచోడవరం, మారేడుమిల్లి అడవుల్లో హై-ఇంటెన్సిటీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలో హైదరాబాద్ పరిసరాల్లో నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో డింపుల్ హయాతి మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. 1960ల నేపథ్యంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో సాగే ఈ కథ యాక్షన్, భావోద్వేగాలతో నిండిన పీరియడ్ డ్రామాగా రూపొందుతోంది.
భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘భోగి’ చిత్రం రక్షా బంధన్ సందర్భంగా ఆగస్టు 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
‘భోగి’లోకందుల సులోచన రాణిగా..
- Advertisement -
- Advertisement -



