నవతెలంగాణ – హైదరాబాద్ : నారాయణగూడ మెట్రో స్టేషన్ సమీపంలోని మార్వెల్ ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంకులో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆటోలో మంటలు చెలరేగడంతో ఒక ఆటో పూర్తిగా దగ్ధమైపోగా, మరో ఆటో పాక్షికంగా దెబ్బతింది. పోలీసుల వివరాల ప్రకారం.. 3146 నంబర్ గల ఆటోకు గ్యాస్ నింపుతున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే మంటలు పక్కనే ఉన్న మరో ఆటోకు వ్యాపించాయి. అప్రమత్తమైన ఆటో డ్రైవర్ దేవరకొండ మండలం ముదిగొండ జర్పుల తండాకు చెందిన జర్పుల చిన్న సోముల (45) సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో గ్యాస్ ఫిల్లింగ్ నిర్వహిస్తున్న బండ్లగూడకు చెందిన ఎండీ సిరాజ్ (34)తో పాటు మరో వ్యక్తి రాజ్‌కుమార్ గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం కింగ్‌కోటి ఆస్పత్రికి తరలించారు.
పెట్రోల్ బంకులో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



